KMM: రోడ్డు ప్రమాదంలో చింతకాని ఏఈ మృతి చెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. చింతకాని విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ రెడ్డి రాత్రి ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సందీప్ రెడ్డి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు విద్యుత్ శాఖ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.