NDL: ఆళ్లగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో MLA భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అధికారులు వచ్చే వరకు అక్కడే ఉంటామని స్పష్టం చేశారు.