NLR: లేగుంటపాడు పంచాయతీ అభివృద్ధికి రూ.1.32 కోట్లు కేటాయించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి తెలిపారు. లేగుంటపాడులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 26,979 పాస్ పుస్తకాలు అందించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.80 లక్షలతో జమ్మిపాలెం లింక్ రోడ్డు, రూ.36లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేస్తామని ఆమె ప్రకటించారు.