అన్నమయ్య: రాయచోటి పట్టణంలో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో మల్టీ స్పోర్ట్స్ రిక్రియేషన్ అండ్ రికవరీ క్రీడా సముదాయం నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యాయి. రాష్ట్ర రవాణా,యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఈ ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. ఈ ఏడాదిలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.