WGL: MGM ఆసుపత్రి మార్చురీలో మృతదేహాల పోస్టుమార్టం కోసం రూ. 4 వేలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖిలావరంగల్కు చెందిన రవి (51) ప్రమాదవశాత్తు మృతి చెందగా.. డబ్బులివ్వలేదని పోస్టుమార్టం ఆలస్యం చేసి కుటుంబాన్ని వేధించారని బంధువులు ఆరోపించారు. డ్యూటీ వైద్యులు ముందే వెళ్లిపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం బాధితులకు మరింత కష్టాలు తెచ్చిపెట్టాయి.