కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేసి, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.