ASR: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 21న మానవత్వ నైతిక విలువలు, 23న పర్యావరణ పరిరక్షణ విద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ కే.గోవిందరావు శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. హాజరు కాని విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయినట్లు పరిగణించబడరని స్పష్టం చేశారు.