NLG: కృష్ణ నది నీటి పంపకాల్లో గత ప్రభుత్వం తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం (512 టీఎంసీలు) అంగీకరించడం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు నష్టపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే కృష్ణ జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా దక్కేలా పోరాడుతున్నామని తెలిపారు.