VZM: చీపురుపల్లి పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి, శిలాఫలకం ఆవిష్కరణ (ROB) శనివారం ఉ 9:30 గంటలకు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ మల్లిక్ నాయుడు పాల్గొనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.