సూర్యాపేట: గరిడేపల్లి మండలంలోని 11 గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం డీపీవో యాదగిరికి వినతిపత్రం అందజేశారు. సాంకేతిక కారణాలతో వేతనాలు ఆపడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.