HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఎయిర్ లైన్ టికెట్ బుక్ చేసుకున్న వారికి RGIA అధికారులు పలు సూచనలు చేశారు. దేశంలోని ఉత్తర భాగంలో అధికంగా పొగ మంచు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో, రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, ఈ నేపథ్యంలో ఎప్పుడైనా క్యాన్సిల్ జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.