W.G: నరసాపురంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. చలవపేటకు చెందిన ఎన్. శ్రీను మంగళవారం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. నిందితుడిని గురువారం అడిషనల్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ఎదుట హాజరుపరచగా, ఆమె రూ. 10 వేల అపరాధ రుసుము విధించినట్లు టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.