BHNG: చేనేత రుణమాఫీ అమలు చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా కార్మికులందరూ సంఘటితంగా ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద BJP చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలపై కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.