KNR: జమ్మికుంట మున్సిపల్ గ్రేడ్-1 కమిషనర్ మహమ్మద్ ఆయాజ్కు స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2003 నుంచి మున్సిపల్ శాఖలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పదోన్నతి దక్కింది. 2024 ఫిబ్రవరిలో జమ్మికుంట బాధ్యతలు చేపట్టిన ఆయన, పన్నుల వసూళ్లలో పురపాలికను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు.