NZB: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన తల్లీ, బిడ్డ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. పూజారి వెన్నెల ఆమె ఏడాదిన్నర వయసున్న కూతురుని తీసుకొని బుధవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో భర్త నరసింహా వారి ఆచూకీ కోసం గాలించారు. అయినా వారు దొరకకపోవడంతో రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.