WGL: జిల్లా పరిధిలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం శనివారం లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ సీహెచ్. కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేళా HNK సుబేదారి పాత DTO కార్యాలయం ఆవరణలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.