KRNL: తుంగభద్ర దిగువ కాలువకు జనవరి నెల చివరి వరకు సాగునీరు అందించాలని, సాగులో ఉన్న మిరప పంటను కాపాడాలని టీడీపీ తెలుగు రైతు సంఘం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సాయిబాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తుంగభద్ర బోర్డు కార్యదర్శి అలాగే ఎస్ఈ నారాయణ నాయక్‌ను కలిసి ప్రత్యేకంగా విన్నవించారు. కాలువ కింద సుమారు 25 వేల ఎకరాల వరకు పంటలు సాగు చేశారన్నారు.