NLG: నార్కెట్పల్లి మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ దూదిమెట్ల సత్తయ్య అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.