RR: NDRF బృందాలు సరూర్ నగర్ పరిధి కర్మాన్ ఘాట్ ఏరియాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు CPR పై విస్తృతంగా అవగాహన కల్పించారు. అకస్మాత్తుగా కిందపడిన వ్యక్తికి CPR చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని డాక్టర్ నారాయణ తెలిపారు. దాదాపు 246 మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వివరించారు.