KMM: ఆదిలాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 12న నిర్వహించనున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సబ్ జూనియర్ విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొని ప్రతిభ చూపించాలని కోరారు.