TG: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. శంషాబాద్ పరిధిలోని మధురానగర్ ప్రాంతంలో దుండగులు ఓ యువకుడిని గొంతు కోసి హతమార్చారు. నడిరోడ్డుపై, జన సంచారం ఉన్న చోట హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.