RR: కొత్తపేట డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ పర్యటించారు. కాలనీలో డ్రైనేజ్ సమస్యలు, కలుషితం అవుతున్న బోర్ వాటర్, జీహెచ్ఎంసీ స్వీపర్ల ద్వారా సరైన శుభ్రపరిచే పనులు జరగకపోవడం వంటి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కార్పోరేటర్‌కు విన్నవించారు.