కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో శనివారం కూరగాయల ధరలు కేజీలలో ఈ విధంగా ఉన్నాయి. వంగ కిలో రూ. 18 నుంచి రూ. 24 వరకు లభ్యమయ్యాయి. బంగాళాదుంప రూ. 23, బీట్రూట్ రూ. 29, ఉల్లి రూ. 27గా నమోదవగా, బెండ రూ. 40, కీరదోస రూ. 31 ధర పలికాయి. బీర రూ. 30–32 మధ్య ఉండగా, దొండ కిలో రూ. 40గా విక్రయమయ్యాయి. పచ్చిమిర్చి రూ. 35, క్యారెట్ రూ.29, టమాటా రూ.25గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.