KRNL: పులివెందులలో నేటి నుంచి 14వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి సైకిల్ పోలో పోటీలకు కర్నూలుకు చెందిన పుష్పవతి ఎంపికైంది. రాయలసీమ యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆమె ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, సైకిల్ పోలో సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.