NTR: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల భద్రత, సౌకర్యాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సంయుక్త రవాణా కమిషనర్ మోహన్ స్పష్టం చేశారు. స్థానిక డీటీసీ కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకొని ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసినా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా లైసెన్సుల రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు.