NTR: నందిగామ పట్టణ శివారులోని వై జంక్షన్ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ నెలకొంది. వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లో రహదారిపై గుంతలు ఏర్పడటంతో వాహన రాకపోకలు నిదానంగా సాగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగిందని స్థానికులు తెలిపారు.