NLG: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.