అంధుల క్రికెట్లో భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టును రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఘనంగా సత్కరించారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫౌండేషన్ తరపున ఆ టీమ్‌కు నీతా అంబానీ రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, సచిన్, రోహిత్ శర్మ పాల్గొన్నారు.