TG: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండలి సెక్రటేరియట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా MLC స్థానం ఖాళీ అయింది.