AP: స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేలకు పైగా SHG ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. SHG సంఘాలు, మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆర్థిక సుస్థిరత చేకూరేలా ఉత్పత్తులను వ్యవస్థీకృతం చేయాలని అధికారులకు సూచించారు.