తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కేవలం 10 రోజుల్లో 7.60 లక్షల మందికి దర్శనాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకోగా తొమ్మిది రోజులకే 7.09 కోట్ల మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. తొమ్మిది రోజుల్లో హుండీ కానుకలు రూ.36.86 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.