న్యూజిలాండ్తో 3 వన్డేల సిరిస్కు రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. నిన్న బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పంత్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పంత్ ఈ సిరీస్ నుంచి వైదొలగాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ ఆకట్టుకున్నాడు. దీంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఇవాళ ఇండియా, న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా తొలి వన్డే జరగనుంది.