W.G: ఆచంట మండలం ఉత్తరపాలెం సమీపంలో కోడేరు-పెదమల్లం రహదారి మార్జిన్ పంట కాలువ వైపు పూర్తిగా దెబ్బతింది. రోడ్డు కుంచించుకుపోవడంతో రాత్రి వేళల్లో ఎదురెదురుగా వచ్చే వాహనదారులు కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు.