కడప జిల్లాలో టమోటా ధరలు రోజుకోలా మారుతూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పక్క జిల్లాల్లో 30 కిలోల గంపకు రు.700–800 ధర పలుకుతుంటే, మైదుకూరులో మాత్రం అదే గంపకు రు.250–300 మాత్రమే లభిస్తోంది. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.