RR: సంక్రాంతి పండుగ వేళ వివిధ బస్టాండ్లలో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఎల్బీనగర్, హయత్ నగర్, మెహిదీపట్నం లాంటి ప్రాంతాల్లో రోడ్లపై వందలాది సంఖ్యలో ప్రయాణికులు కనిపిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం, దగ్గరుండి చర్యలు చేపడుతూ.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపింది.