ASR: ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో చెర్రీ పండ్ల సీజన్ సందడి చేస్తోంది. చల్లని వాతావరణంలో, పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండించే ఈ పండ్లను రుచి చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. 20 పళ్లున్న బాక్స్ ధర ప్రస్తుతం రూ. 80 పలుకుతోంది. ధర పెరిగినా, రసాయనాలు లేని ఈ పండ్లకు డిమాండ్ ఉంది.