ATP: అనంతపురంలోని మాంస విక్రయ కేంద్రాలపై మాంసాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. నడిమివంక, బళ్లారి రోడ్డు, మార్కెట్ యార్డు ప్రాంతాల్లోని దుకాణాలను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న దుకాణాలకు జరిమానాలు విధించారు. చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నట్లు గుర్తించి, ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.