కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార 1’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో జనవరి 24న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. కాగా, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.