PDPL: గోలివాడ గ్రామ శివారులో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర పనులను రామగుండం MLA MSరాజ్ ఠాకూర్ శనివారం అధికారులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతర ఆవరణ, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, భద్రత మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.