TG: సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కొంతమంది యూట్యూబర్లు మైనర్లతో ఇంటర్వ్యూ లు చేస్తూ వారితో బూతులు మాట్లాడిస్తున్నారు. అలాంటి వాళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఓ యూట్యూబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైరల్ హబ్ 007 అనే ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్న కంబేటి సత్యమూర్తి అనే యాంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.