సాధారణంగా వచ్చే దగ్గును చాలామంది వాతావరణ మార్పుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు కొనసాగితే ప్రమాదమం. దగ్గుతో పాటు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అస్సలు లైట్ తీసుకోకూడదు. ఇది టీబీ, ఆస్తమా లేదా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు సంకేతం కావచ్చు. సరైన సమయంలో డాక్టర్ను సంప్రదించడం మంచిది.