తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం లోని అన్ని షాపులు మరియు రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని, వ్యాపారాలు సాగించవచ్చని ప్రకటన చేసారు. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్ పేరు, ఉద్యోగరీత్యా రాత్రిళ్ళు కూడా చేస్తుంటారు… 10 గంటలకే రెస్టారెంట్లు మూసివేయడంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టు అన్నారు..
రాత్రి ఒంటిగంట వరుకు రెస్టారెంట్లు తెరిచి ఉంచే నిర్ణయం ద్వారా వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు, యువతకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల షాపులు మరియు రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం వల్ల, స్థానిక ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రభావం చూపుతుందని, అలాగే విదేశీ పర్యాటకుల కోసం తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం అవుతుందని సీఎం చెప్పారు.
అంతేకాక, ఈ నిర్ణయంతో ఉద్యోగుల మరియు వ్యాపారుల జీవిత శైలీకి మరింత సౌకర్యం ఏర్పడుతుందని, ప్రజలు రాత్రిపూట కూడా విశ్రాంతి లేకుండా, అవసరమైన వస్తువులు సులభంగా పొందగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి ఈ నిర్ణయాన్ని త్వరలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటారని, దీని ద్వారా ప్రతి ఒక్కరికీ లాభం చేకూరుతుందని ఆశిస్తున్నారు.
సిటీ లో DLF, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కు వారు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు