మహేష్ … ఆ పేరులోనే వైబ్రేషన్ వుంది అనేది ఒక సినిమాలో డైలాగ్. 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరుకు… అనకాపల్లి నుంచి అమెరికా వరుకు… పల్లెటూళ్ళో ఉండే ఒక సాధారణ రైతు దగ్గర నుంచి ఖండాలు దాటి విదేశాల్లో బడా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అనే తేడా లేకుండా ఇష్టపడే వ్యక్తి మహేష్ బాబు.
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం పుణికిపుచ్చుకుని… చిన్ననాటి నుంచే కెమెరా ముందు ఆక్ట్ చేసి ఘట్టమనేని అభిమానులకే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన మహేష్, 1999 లో కే రాఘవేంద్ర రావు డైరెక్షన్, వైజయంతి మూవీస్ బ్యానర్లో రాజకుమారుడు తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. వాస్తవానికి హీరోగా కెరీర్ తొలినాళ్ళ నుంచే మంచిఫ్యామిలీ సబ్జక్ట్స్ ని ఎంచుకున్నాడు మహేష్, ఆకారణంగానే ఈరోజుకి మహేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ లో నెంబర్ 1 ఫాలోయింగ్ ఏర్పడించి
1999 నుంచి రాజకుమారుడు, యువరాజు, మురారి లాంటి మంచి హిట్లతో, టక్కరిదొంగ తో కష్టపడినా ఫలితం అనుకూలంగా రాలేదు. 2003 సంక్రాంతికి గుణ శేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఒక్కడు మహేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆరోజుల్లో చాలా సెంటర్స్ లో టౌన్ రికార్డ్స్ క్రీస్తే చేసింది ఒక్కడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నేటికీ ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. వచ్చే ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మల్లి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు అభిమానులు
పోకిరి తో టచ్ చేయలేని రేంజ్:
2006 సమ్మర్ సెన్సషన్ పోకిరి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా క్రియేట్ చేసిన యుఫొరియా అంతాఇంతా కాదు. సుమారు 100 రోజులు ఈ సినిమా చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మహేష్ వెంట కార్పొరేట్ బ్రాండ్స్ పడ్డాయి. థమ్స్ అప్, ఐడియా లాంటి కార్పొరేట్ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. సుమారు 30 కి పైగా బ్రాండ్స్ మహేష్ ఖాతాలో ఉన్నాయి.
పోకిరి తరువాత కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. తరువాత దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్స్ గా నిలిచాయి.. 1 నేనొక్కడినే ప్లాప్ అయినా ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి మంచి హిట్స్ గ నిలిచాయి. ఈ మూడు చిత్రాలకు మంచి వసూళ్లు మాత్రమే కాకుండా మహేష్ కు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి మార్కెట్ ఉన్నా మహేష్ ఇప్పటివరకూ పాన్ ఇండియాకు వెళ్ళలేదు. రాజమౌళి సినిమాతోనే దానికి శ్రీకారం చుడదాం అని అనుకునివుండొచ్చు. కానీ RRR సినిమా ఆస్కార్ రేంజ్ కి వెళ్లడం తో మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ గా చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం
25 ఏళ్ళ ప్రస్థానం లో హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. తన కెరీర్ లో మరిన్ని విజయావకాశాలు అందిపుచ్చుకుని పాన్ వరల్డ్ మార్కెట్ లో కూడా తనదైన మార్క్ చూపాలని కోరుకుందాం