చదువుకోడానికి వెళ్తే ప్రాణాలు పోవాల్సిందేనా? గడిచిన ఐదేళ్లలో అక్కడ 633మంది భారత విద్యార్థులు చనిపోయారు..
చదువు… ప్రతీఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం… చదువుకు వయసు లేదంటారు.. విద్యార్థి దశలో జీవితంలో ఉత్తమ కెరీర్, ఉద్యోగం సాధించాలనే పట్టుదల, దీక్షతో ఎంతోమంది విద్యార్థులు ఎంతో కష్టంగా ఉన్నా… అయినవారందరినీ వదిలి ఖండాలు దాటి విద్యను అభ్యసిస్తున్నారు. 90 శాతం పైన కుటుంబాలు బ్యాంకు రుణాలు, ఆస్తులు అమ్మి, వడ్డీలకు అప్పులు చేసి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు
అయితే ఈమధ్య రాజ్యసభలో కేరళ ఎంపీ కొడికునిల్ సురేశ్ అడిగిన ఒక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో వివిధ కోర్సుల చదువుకోసం విదేశాలకు వెళ్లిన భారత విద్యార్థుల్లో 633 మంది 41 దేశాల్లో మరణించారని వెల్లడించారు. 633 మందిలో అత్యధికంగా కెనడాలో 172 మంది, అమెరికా (USA)లో 108, ఇంగ్లాండ్ (UK) లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యా 37, జర్మనీలో 24 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు.
అసలు ఎందుకు ఇలా జరుగుతుందని, మరణాలకు గల కారణాలు పరిశీలిస్తే సహజ మరణాలు, ప్రమాదాలు, దాడులు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. హింసా ఘటనల్లో 19మంది మరణిస్తే ఎక్కువమంది (9 మంది) కెనడాలో ప్రాణాలు విడిచారు. ప్రస్తుత 2024 గణాంకాల ప్రకారం 13. లక్షల విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు