ఉల్లిపాయలో విటమిన్ ‘సి’ , ‘బి’ వంటి విటమిన్లు, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఈ పోషకాలు అందుతాయి. విటమిన్ ‘సి’ ఉన్న ఉల్లిపాయ రసం తాగడం కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఉల్లిలో ఉండే సల్ఫర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.