ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో.. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లింది ఈ సినిమా. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో కెజీయఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరివ్‌లతో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇక సెకండ్ షెడ్యూల్‌ను దసరా తర్వాత మొదలు పెట్టబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో నటిస్తున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.
ఇక ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’లో రావణ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్‌కు విలన్‌గా సైఫ్ అలీఖాన్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబీ28లో విలన్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని.. అందుకే సైఫ్అలీఖాన్ ఫిక్స్ అయ్యాడని టాక్. ఇప్పటికే ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు స్టార్ హీరో విలన్ అంటున్నారు. అయితే ఇంతకు ముందు కూడా మళయాళ హీరోల పేర్లు వినిపించాయి. దాంతో ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది.