AP: 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫ్యాక్షన్ రాయకీయాలపై యుద్ధం ప్రకటించారని మంత్రి లోకేష్ తెలిపారు. 2004 తర్వాత వైఎస్ హయాంలో 164 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని ఆరోపించారు. అలాగే, హత్యకు గురైన వారి పిల్లలను చదివించేందుకు ఎన్టీఆర్ స్కూల్లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పిల్లలు ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఉండేలా తాము చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.