హోళీ రోజున అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. వాస్తవానికి హోళీ అంటే ఇలా రంగులు పుసుకోవడమే కాదు. ఇది చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా, వసంతకాల రాకను ఆహ్వానిస్తూ జరుపుకునే పండగ. పాత గొడవలను మర్చిపోయి, అందరూ స్నేహంగా రంగులతో ప్రేమను పంచుకుంటారు. అందుకే ఈ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ బంధువులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు.