AP: పోలీసుల సంక్షేమంపై ఆలోచించింది కూటమి ప్రభుత్వమే అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు కూడా సరిగా ఇవ్వలేదన్నారు. ఇవాళ నెలలో ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉందన్నారు. ‘రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. రాజకీయాలను పోలీసులపై నెట్టడం మంచిది కాదు. కోర్టు కేసులు క్లియర్ చేసి రిక్రూట్మెంట్ చేపట్టాం’ అని తెలిపారు.