MBNR: నవాబ్ పేట మండలం కాకర్ల పహాడ్లో నూతన డ్వాక్రా భవన నిర్మాణానికి సర్పంచ్ బాలయ్య శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీలత, ఉప సర్పంచ్ అంబెడ్కర్, కాంగ్రెస్ నాయకులు మైనోద్దీన్, అంకం గోపాల్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.